నీవే నీవే కావాలి ప్రభువుకు
Neeve Neeve Kaavaali Prabhuvuku
నీవే నీవే కావాలి ప్రభువుకు
నేడే నేడే చేరాలి ప్రభువును (2)
ఈ కాలం కృప కాలం తరిగిపోతుంది
నీ మరణం లోకాంతం తరుముకొస్తుంది (2) ||నీవే||
నీ సృష్టికర్తను నీవు విడచినా
నీకిష్టమైన రీతి నీవు నడచినా (2)
దోషివయినా ద్రోహివయినా
దేవుని చెంత – చేరిపుడైనా (2) ||ఈ కాలం||
పాపాలతో నీవు పండిపోయినా
ప్రేమించువారు లేక కృంగిపోయినా (2)
యేసుని చరణం – పాప హరణం
యేసుని స్నేహం – పాపికి మోక్షం (2) ||ఈ కాలం||
నీటి బుడగలాంటిది నీ జీవితం
గడ్డి పువ్వులాంటిది నీ యవ్వనం (2)
అధికుడవైనా అధముడవైనా
ఆయన ప్రేమ – కోరిపుడైనా (2) ||ఈ కాలం||
neeve neeve kaavaali prabhuvuku
nede nede cheraali prabhuvunu (2)
ee kaalam krupa kaalam tharigipothundhi
nee maranam lokaantham tharumukosthundhi (2) ||neeve||
nee srushtikarthanu neevu vidachinaa
neekishtamaina reethi neevu nadachinaa (2)
doshivainaa dhrohivainaa
devuni chentha – cheripudainaa (2) ||ee kaalam||
paapaalatho neevu pandipoyinaa
preminchuvaaru leka krungipoyinaa (2)
yesuni charanam – paapa haranam
yesuni sneham – paapiki moksham (2) ||ee kaalam||
neeti budagalaantidhi nee jeevitham
gaddi puvvulaantidhi nee yavvanam (2)
adhikudavainaa adhamudavainaa
aayana prema – koripudainaa (2) ||ee kaalam||