• waytochurch.com logo
  • Song - 12514 : Nijamaina Draakshaavalli Neevee నిజమైన ద్రాక్షావల్లి నీవే Lyrics

  • Quick search
  • నిజమైన ద్రాక్షావల్లి నీవే
    నిత్యమైన సంతోషము నీలోనే (2)
    శాశ్వతమైనది ఎంతో మధురమైనది
    నాపైన నీకున్న ప్రేమ
    ఎనలేని నీ ప్రేమ – (2) ||నిజమైన||

    అతి కాంక్షనీయుడా దివ్యమైన నీ రూపులో
    జీవించున్నాను నీ ప్రేమకు నే పత్రికగా (2)
    శిధిలమై యుండగా నన్ను నీదు రక్తముతో కడిగి
    నీ పోలికగా మార్చినావే నా యేసయ్యా (2) ||నిజమైన||

    నా ప్రాణ ప్రియుడా శ్రేష్టమైన ఫలములతో
    అర్పించుచున్నాను సర్వము నీకే అర్పణగా (2)
    వాడిపోనివ్వక నాకు ఆశ్రయమైతివి నీవు
    జీవపు ఊటవై బలపరచితివి నా యేసయ్యా (2) ||నిజమైన||

    షాలేము రాజా రమ్యమైన సీయోనుకే
    నను నడిపించుము నీ చిత్తమైన మార్గములో (2)
    అలసి పోనివ్వక నన్ను నీదు ఆత్మతో నింపి
    ఆదరణ కర్తవై నను చేర్చుము నీ రాజ్యములో (2) ||నిజమైన||

    Language:Telugu | 672 | Write Comment
  • Post new Lyric | See Tips | Latest | Top Views | Songs List | mostviewed | Total Hits: 5770331
  • title
  • Name :
  • E-mail :
  • Type

© 2018 Waytochurch.com