• waytochurch.com logo
Song # 12514

Nijamaina Draakshaavalli Neevee నిజమైన ద్రాక్షావల్లి నీవే


నిజమైన ద్రాక్షావల్లి నీవే
నిత్యమైన సంతోషము నీలోనే (2)
శాశ్వతమైనది ఎంతో మధురమైనది
నాపైన నీకున్న ప్రేమ
ఎనలేని నీ ప్రేమ – (2) ||నిజమైన||

అతి కాంక్షనీయుడా దివ్యమైన నీ రూపులో
జీవించున్నాను నీ ప్రేమకు నే పత్రికగా (2)
శిధిలమై యుండగా నన్ను నీదు రక్తముతో కడిగి
నీ పోలికగా మార్చినావే నా యేసయ్యా (2) ||నిజమైన||

నా ప్రాణ ప్రియుడా శ్రేష్టమైన ఫలములతో
అర్పించుచున్నాను సర్వము నీకే అర్పణగా (2)
వాడిపోనివ్వక నాకు ఆశ్రయమైతివి నీవు
జీవపు ఊటవై బలపరచితివి నా యేసయ్యా (2) ||నిజమైన||

షాలేము రాజా రమ్యమైన సీయోనుకే
నను నడిపించుము నీ చిత్తమైన మార్గములో (2)
అలసి పోనివ్వక నన్ను నీదు ఆత్మతో నింపి
ఆదరణ కర్తవై నను చేర్చుము నీ రాజ్యములో (2) ||నిజమైన||

nijamaina draakshaavalli neevee
nithyamaina santhoshamu neelone (2)
shaashwathamainadhi entho madhuramainadhi
naapaina neekunna prema
enaleni nee prema – (2) ||nijamaina||

athi kaankshaneeyudaa divyamaina nee roopulo
jeevinchuchunnaanu nee premaku ne pathrikagaa (2)
shithilamaiyundagaa nannu needhu rakthamutho kadigi
nee polikagaa maarchinaave naa yesayyaa (2) ||nijamaina||

naa praanapriyudaa sreshtamaina phalamulatho
arpinchuchunnaanu sarvamu neeke arpanagaa (2)
vaadiponivvaka naaku aashrayamaithivi neevu
jeevapu ootavai balaparachithivi naa yesayyaa (2) ||nijamaina||

shaalemu raajaa ramyamaina seeyonuke
nanu nadipinchumu nee chitthamaina maargamulo (2)
alasi ponivvaka nannu needhu aathmatho nimpi
aadharanakarthavai nanu cherchumu nee raajyamulo (2) ||nijamaina||


                                
Posted on
  • Song
  • Name :
  • E-mail :
  • Song No

© 2023 Waytochurch.com