• waytochurch.com logo
  • Song - 12516 : Viluvainadhi Samayamu O Nesthamaa విలువైనది సమయము ఓ నేస్తమా Lyrics

  • Quick search
  • విలువైనది సమయము ఓ నేస్తమా
    ఘనమైనది జీవితం ఓ ప్రియతమా (2)
    సమయము పోనివ్వక సద్భక్తితో
    సంపూర్ణతకై సాగెదము (2) ||విలువైనది||

    క్రీస్తుతో మనము లెపబడిన వారమై
    పైనున్నవాటినే వెదకిన యెడల (2)
    గొర్రెపిల్లతొ కలిసి
    సీయోను శిఖరముపై నిలిచెదము (2) ||విలువైనది||

    శోధన మనము సహించిన వారమై
    క్రీస్తుతొ మనము శ్రమించిన యెడల (2)
    సర్వాధికారియైన
    ప్రభువుతో కలిసి ఏలెదము (2) ||విలువైనది||

    క్రీస్తుతో మనము సింహాసనముపై
    పాలించుటకై జయమొందుటకు (2)
    సమర్పణ కలిగి
    పరిశుద్దతలో నిలిచెదము (2) ||విలువైనది||

    Language:Telugu | 551 | Write Comment
  • Post new Lyric | See Tips | Latest | Top Views | Songs List | mostviewed | Total Hits: 5768528
  • title
  • Name :
  • E-mail :
  • Type

© 2018 Waytochurch.com