Swachchandha Seeyonu Vaasi స్వఛ్చంద సీయోను వాసి
స్వఛ్చంద సీయోను వాసిసర్వాధికారి – కస్తూరి పూరాసి (2)వర్తమాన భూత భవి-ష్యత్కాల వాసి (2)అల్ఫా ఒమేగ తానే (2)ఆద్యంతము మన యేసే (2) ||స్వఛ్చంద||ఇదిగో నేనొక నిబంధననుఅద్భుతములు జేతున్ – నీ ప్రజలందరి యెదుట (2)పరిశోధింపజాలని మహా – పనులెల్ల ప్రభువే (2)లెక్క లేని యద్భుతముల్ (2)మక్కువతో చేయువాడు (2) ||స్వఛ్చంద||సంగీతం నాదముల తోడసీయోను పురము – సొంపుగను చేరితిమి (2)శాశ్వత సంతోషము మా – శిరములపై వెలసెన్ (2)దుఃఖము నిట్టూర్పును పోయెన్ (2)మిక్కిలి ఆనందము కల్గెన్ (2) ||స్వఛ్చంద||నీలముల పునాదులు వేసినీలాంజనములతో – మాణిక్య మణులతో (2)సువర్ణ శునీయముల – సూర్య కాంతముతో (2)ప్రశస్త రత్నములతో (2)ప్రవిమలముగా నిను గట్టెదను (2) ||స్వఛ్చంద||సుమముల హారముసంతోషానంద తైలము నీదే – స్తుతి వస్త్రమును నీదే (2)ఉల్లాస వస్త్రంబు నీదే – విడుదలయి నీదే (2)హిత వత్సరము విముక్తి (2)ఆత్మాభిషేకము నీదే (2) ||స్వఛ్చంద||జలములలో బడి దాటునప్పుడుబలమై యుండెదను – నీ తోడై యుండెదను (2)నదులలో వెళ్లునప్పుడు – నీపై పారవు (2)అగ్ని మధ్యను నడచినను (2)జ్వాలలు నిను కాల్చగ లేవు (2) ||స్వఛ్చంద||ఇత్తడి తలుపుల బగుల గొట్టెదనినుప ఘడియలను – విడగొట్టెదను నేను (2)అంధకార స్థలములలో ను-న్నట్టి నిధులను (2)రహస్యములో మరుగైన (2)ధనమును నీ కొసంగెదను (2) ||స్వఛ్చంద||గర్భమున పుట్టినది మొదలుతల్లి యొడిలోన – కూర్చుండినది మొదలు (2)నేను చంక బెట్టుకొన్న – నాదు ప్రజలారా (2)ముదిమి వచ్చుఁ వరకు నిన్ను (2)ఎత్తుకొను వాడను నేనే (2) ||స్వఛ్చంద||
swachchandha seeyonu vaasisarvaadhikaari – kasthoori pooraasi (2)varthamaana bhootha bhavi-shyathkaala vaasi (2)alphaa omega thaane (2)aadhyanthamu mana yese (2) ||swachchandha||idigo nenoka nibandhananuadhbhuthamula jethun – nee prajalandhari yeduta (2)parishodhimpajaalani mahaa – panulella prabhuve (2)lekkal leni yadhbhuthamul (2)makkuvatho cheyuvaadu (2) ||swachchandha||sangeetham naadhamula thodaseeyonu puramu – sompuganu cherithimi (2)shaashwatha santhoshamu maa – shiramulapai velasen (2)dukhamu nittoorpunu poyen (2)mikkili aanandamu kalgen (2) ||swachchandha||neelamula punaadhulu vesineelaanjanamulatho – maanikya manulatho (2)suvarna shuneeyamula – soorya kaanthamutho (2)prashastha rathnamulatho (2)pravimalamuga ninu gattedhanu (2) ||swachchandha||sumamula haaramusanthoshaanandha thailamu needhe – sthuthi vasthramunu needhe (2)ullaasa vasthrambu needhe – vidudhalayu needhe (2)hitha vathsaramu vimukthi (2)aathmaabhishekamu needhe (2) ||swachchandha||jalamulalo badi daatunappudubalamai yundedhanu – nee thodai yundedhanu (2)nadhulalo vellunappudu – neepai paaravu (2)agni madhyanu nadachinanu (2)jwaalalu ninu kaalchaga levu (2) ||swachchandha||itthadi thalupula bagula gottedhaninupa gadiyalanu – vidagottedhanu nenu (2)andhakaara sthalamulalo nu-nnatti nidhulanu (2)rahasyamulo marugaina (2)dhanamunu nee kosangedhanu (2) ||swachchandha||garbhamuna puttinadhi modhaluthalli yodilona – koorchundinadhi modhalu (2)nenu chanka bettukonna – naadhu prajalaaraa (2)mudhimi vachchu varaku ninnu (2)etthukonu vaadanu nene (2) ||swachchandha||