• waytochurch.com logo
 • Song - 12521 : Entha Premo Naapai Yesayyaa ఎంత ప్రేమో నాపై యేసయ్యా Lyrics

 • Quick search
 • Entha Premo Naapai Yesayyaa ఎంత ప్రేమో నాపై యేసయ్యా Lyrics in Telugu


  ఎంత ప్రేమో నాపై యేసయ్యా
  నేను ఎలాగ వివరించగలనయ్యా (2)
  పెంట కుప్పలలో పడి ఉన్ననూ
  నా మెడ మీద పడి ముద్దు పెట్టితివా
  జిగట ఊబిలో నేను దిగి ఉన్ననూ
  నా చేయి పట్టి నను పైకి లేపితివా ||ఎంత||

  దాహం తీర్చగలేని బావి అయిననూ
  నేను పాపపు కుండను విడువకుంటిని (2)
  నా పాపమంత క్షమించితివి (2)
  జీవ జలమిచ్చి నన్ను చేర్చుకుంటివి (2) ||ఎంత||

  పందులున్న చోట నలిగి పడి ఉంటిని
  నా పాపమే చుట్టు ముట్టి పట్టుకున్నది (2)
  బుద్ధి వఛ్చి నేను నిన్ను ఆశ్రయించగా (2)
  క్షమియించి నీ రక్షణిచ్చితివి (2) ||ఎంత||

  నరికిన కొమ్మ వలె ఎండిపోతిని
  నా పాపాన్ని దాచి దాచి నశించితిని (2)
  ఒప్పుకొనగా నాకు జీవమిచ్చితివి (2)
  (ఎండిన) మొద్దును చిగురింపజేసితివి (2) ||ఎంత||

  Language:Telugu | 168 | Write Comment
 • Post new Lyric | See Tips | Latest | Top Views | Songs List | mostviewed | Total Hits: 6457614
 • title
 • Name :
 • E-mail :
 • Type

© 2018 Waytochurch.com