• waytochurch.com logo
Song # 12531

నిన్నే నమ్మినాను యేసయ్య నన్ను విడిచి పోకు యేసయ్య

ninne namminanu yesayya


నిన్నే నమ్మినాను యేసయ్య నన్ను విడిచి పోకు యేసయ్య 2
నా ప్రాణం ధ్యానం జీవం నీవే 2
నిన్నే చేరినాను యేసయ్య 2

1. కదులుచున్న మేఘములు ప్రేమ జల్లు కురిపించే
ఎండిన నా హృదయములో జీవజలములూరాలని
నా జీవము నీవై నా లోనే ఉండాలని
నీ నోటి మాటలే ఊటలుగా మారాలని
మాట కొరకు చూసా యేసయ్య
మాటలాడా రావా యేసయ్య

నా మాట పాట ఊటలు నీవే
నిన్నే చేరినాను యేసయ్య 2

2. లోకములో సంపదలు నాకెన్ని కలిగినను
ప్రియమైన నీ పొందే కోరుకునే నా హృదయం
నీవే నాకు తరగని ధనము
నిన్నే నేను కోరుకొనుచున్నాను
మనసారా నిన్నే యేసయ్య
నా ప్రాణం కోరే యేసయ్య

నా బలము ధనము ఘనము నీవే
నిన్నే చేరినాను యేసయ్య 2

3. ధగధగమని మిరిసేటి నీ నిత్య రాజ్యములో
నీతోనే కలిసి మెలిసి కలకాలం ఉండాలని
బంగారపు వీధులలో నీతోనే నడవాలని
పొందబోయే బహుమానం కన్నులార చూడాలని
ఆశతోనే చూసా యేసయ్య
ఆశలన్నీ నీవే యేసయ్య

నా ఆశ ధ్యాస శ్వాస నీవే
నిన్నే కోరినాను యేసయ్య 2


                                
Posted on
  • Song
  • Name :
  • E-mail :
  • Song No
  • Song youtube video link :
    Copy sharelink from youtube and paste it here

© 2025 Waytochurch.com