Siluvalo Nee Prema Paapamu Theesenayyaa సిలువలో నీ ప్రేమ – పాపము తీసేనయ్యా
సిలువలో నీ ప్రేమ – పాపము తీసేనయ్యామరణము చెరలో నుండి – నను విడిపించేనయ్యా (2)ఘోర పాపిని నేను – పరిశుద్ధుని చేసితివినిత్యజీవములో నన్ను – నిలుపుటకు బలి అయితివి (2) ||సిలువలో||తాళలేని నీ తాపం – తొలగించెను నాదు శాపంనలిగినట్టి నీ రూపం – ఇచ్చేను నాకు స్వరూపం (2)నను విడిపించుటకు – విలువను విడిచితివిపరమును చేర్చుటకు – మహిమను మరిచితివి (2) ||ఘోర పాపిని||దైవ తనయుని దేహం – మోసింది చేయని నేరంకడిగేందుకు నా దోషం – చిందించె నిలువునా రుధిరం (2)నను కాపాడుటకు – రొట్టెగా విరిగితివిమరణము దాటుటకు – బలిగా మారితివి (2) ||ఘోర పాపిని||అధముడయినట్టి నేను – నీ ప్రేమ అర్హుడను కానుపొగిడి నిన్ను ప్రతి క్షణము – తీర్చలేను నీ ఋణము (2)నిను చాటించుటకు – వెలుగై సాగెదనుప్రేమను పంచుటకై – ఉప్పుగ నిలిచెదను (2) ||ఘోర పాపిని||
siluvalo nee prema – paapamu theesenayyaamaranamu cheralo nundi – nanu vidipinchenayyaa (2)ghora paapini nenu – parishuddhuni chesithivinithya jeevamulo nannu – niluputaku bali aithivi (2) ||siluvalo||thaalaleni nee thaapam – tholaginchenu naadhu shaapamnaliginatti nee roopam – ichchenu naaku swaroopam (2)nanu vidipinchutaku – viluvanu vidichithiviparamunu cherchutaku – mahimanu marichithivi (2) ||ghora paapini||daiva thanayuni deham – mosindi cheyani neramkadigendhuku naa dosham – chindinche niluvunaa rudhiram (2)nanu kaapaadutaku – rottegaa virigithivimaranamu dhaatutaku – baligaa maarithivi (2) ||ghora paapini||adhamudainatti nenu – nee prema arhudanu kaanupogidi ninnu prathi kshanamu – theerchalenu nee runamu (2)ninu chaatinchutaku – velugai saagedhanupremanu panchutakai – uppuga nilichedhanu (2) ||ghora paapini||