krotha yedu modalu bettenu క్రొత్త యెడు మొదలు బెట్టెను మన బ్రతుకు నందు క్రొత్త యెడు
పల్లవి: క్రొత్త యెడు మొదలు బెట్టెను - మన బ్రతుకు నందు - క్రొత్త యెడు మొదలు బెట్టెను - క్రొత్త మనసుతోడ మీరు - క్రొత్త యేట ప్రభుని సేవ దత్తరపడకుండజేయు - టుత్తమోత్తమంబు జూడ 1. పొంది యున్న మేలులన్నియు - బొంకంబుమీఱ - డెందమందు స్మరణజేయుచు యిందు మీరు మొదలుబెట్టు - పందెమందు బారవలయు నందముగను రవిని బోలి - నలయకుండ సొలయకుండ ...క్రొత్త... 2. మేలు చేయదడవొనర్చగా - మీరెఱగునట్లు కాలమంత నిరుడు గడచెగా - ప్రాలుమాలి యుండకుండ - జాలమేల సేయవలయు జాల జనము కిమ్మాను - యేలు నామ ఘనత కొరకు ...క్రొత్త... 3. బలములేని వారమయ్యును - బలమొందవచ్చు - గలిమి మీఱ గర్త వాక్కున - నలయకుండ నడగుచుండ - నలగకుండ మోదమొంది బలమొసంగు సర్వవిధుల - నెలవి మీరనర్చుచుండ ...క్రొత్త... 4. ఇద్దరిత్రి నుండునప్పుడే - ఈశ్వరుని జనులు - వృద్ధి బొంద జూడ వలయును - బుద్ధి నీతిశుద్ధులందు - వృద్ధినొంద శ్రద్ధజేయు - శుద్దులైన వారిలొ - బ్ర - సిద్దులగుచు వెలుగవచ్చు ...క్రొత్త... 5. పాప పంక మంటినప్పుడు - ప్రభు క్రీస్తుయేసు - ప్రాపు జేరి మీరు వేడగా - నేపు మీఱదనదు కరుణ - బాపమంత గడిగివేసి పాప రోగ చిహ్నాలన్ని - బాపివేసి శుద్ధిచేయు ...క్రొత్త..