aashrayamaa aadhaaramaa neeve naa yesayyaa ఆశ్రయమా ఆధారమా నీవే నా యేసయ్యా
ఆశ్రయమా ఆధారమా నీవే నా యేసయ్యానా దుర్గమా నా శైలమా నీవే నా యేసయ్యా (2)నిను విడచి నేనుండలేనుక్షణామైనా నే బ్రతుకలేను (2) ||ఆశ్రయమా||కష్ట కాలములు నన్ను కృంగదీసిననుఅరణ్య రోదనలు నన్ను ఆవరించినను (2)నా వెంటే నీవుండినావునీ కృపను చూపించావు (2) ||ఆశ్రయమా||భక్తిహీనులు నాపై పొర్లిపడిననుశత్రు సైన్యము నన్ను చుట్టి ముట్టినను (2)నా వెంటే నీవుండినావుకాపాడి రక్షించినావు (2) ||ఆశ్రయమా||మరణ పాశములు నన్ను చుట్టుకొనగానుబంధు స్నేహితులు నన్ను బాధపెట్టినను (2)నా వెంటే నీవుండినావుదయచూపి దీవించినావు (2) ||ఆశ్రయమా||