krupamayuda neelona కృపామయుడా నీలోనా నివసింప జేసినందునా
పల్లవి: కృపామయుడా - నీలోనా - నివసింప జేసినందునా (2X) యివిగో నా స్తుతుల సింహాసనం - నీలో నివసింప జేసినందునా ...కృపామయుడా..ఆ.. 1. ఏ అపాయము నా గుడారము సమీపించనియ్యక (2X) నా మార్గములన్నిటిలొ.. - నీవె ఆశ్రయమైయుండగా (2X) ...కృపామయుడా..ఆ.. 2. చీకటి నుండి వెలుగులోనికి - నన్ను పిలిచిన తేజోమయా (2X) రాజవంశములో.. - యాజకత్వము చేసేదను (2X) ...కృపామయుడా..ఆ.. 3. నీలో నిలచి ఆత్మఫలములు ఫలియించుట కొరకే (2X) నాపైనా నిండుగా.. ఆత్మవర్షము క్రుమ్మరించు (2X) ...కృపామయుడా..ఆ.. 4. ఏ యోగ్యత లేని నాకు - జీవకిరీటమిచ్చుటకు (2X) నీ కృప ననువీడకా.. - శాశ్వత కృపగా మారెను (2X) ...కృపామయుడా..ఆ..