Ananda ganalatho ఆనంద గానాలతో ఆరాధించెద ఐశ్వర్యవంతుడా యేసయ్య
ఆనంద గానాలతో ఆరాధించెద ఐశ్వర్యవంతుడా యేసయ్యఅనురాగాలు కురిపించి అనువైన దీవెనలు ఇచ్చావనిఆనంద నగరములో స్వాస్థ్యము నాకై దాచవని1. అరణ్య ప్రదేశములో నను కనుగొన్నావుభీకర ధ్వని గల ఎడారిలో నా తోడున్నావునన్నావరించి పరామర్శించి కనుపాప వలె కాపాడినావునా శైలము నీవై నా దుర్గము నీవైఉన్నత స్థలములపై నను నిలిపావు2. నా మనో నేత్రములు వెలిగించియున్నావు నీ శక్తి యొక్క మహాత్యములు తెలియజేసావుఆత్మాభిషేకముతో అభిషేకించి వాక్యోపదేశముతో బలపరిచావునా ధ్యానము నీవై నా ఆరాధనా నీవైనీ పోలికగా నను మలుచుచున్నావు3. నీ జీవ గ్రంధములో నా పేరు రాసావునీ పరిశుద్ధలంకారముతో అలంకరించావునీ బూర శబ్దమును నే వినగానే నా శరీరము మార్పుచెందును నా నిరీక్షణ నీవై నా మహిమా నీవైతేజో వాసులతో నను చేర్చెదవు