anudinam aa prabhuni varameఅనుదినం ఆ ప్రభుని వరమే
అనుదినం ఆ ప్రభుని వరమే అనుక్షణం ఆశ్చర్య కార్యమే ఆనందం-తో స్వీకరించుము అబ్బురం-తో ఆనందించుము పచ్చిక గల చోట్ల నన్ను పరుండజేసిన దేవుడు (2) నూనెతో నా తలను అంటి దీవెనలతో నింపును ||అనుదినం|| అనుదినం ఆ ప్రభుని వరమే అనుక్షణం ఆశ్చర్య కార్యమే ఆనందం-తో స్వీకరించుము అబ్బురం-తో ఆనందించుము తల్లియైనా మరచునేమో మరువడు ప్రభు ఎన్నడూ (2) ముదిమి వచ్ఛు వరకు నన్ను ఎత్తుకొని కాపాడును ||అనుదినం|| అనుదినం ఆ ప్రభుని వరమే అనుక్షణం ఆశ్చర్య కార్యమే ఆనందం-తో స్వీకరించుము అబ్బురం-తో ఆనందించుము నాదు పాపపు భారమెల్ల మోసెను నా దేవుడు (2) సిలువపై మరణించి నాకు రక్షణిచ్చెను యేసుడు ||అనుదినం||