• waytochurch.com logo
Song # 13261

amoolyamaina aanimuthyamaaఅమూల్యమైన ఆణిముత్యమా


అమూల్యమైన ఆణిముత్యమా
యెహోవ దేవుని హస్తకృతమా (2)
అపురూప సౌందర్య రాశివి నీవు
ఆత్మీయ సుగుణశీలివి నీవు (2) ||అమూల్యమైన||
జ్ఞానము కలిగి నోరు తెరచుదువు
కృపగల ఉపదేశమును చేయుదువు (2)
ఇంటివారిని బాగుగ నడుపుచూ
వారి మన్ననలను పొందుచుందువు (2) ||అమూల్యమైన||
చేతులతో బలముగా పనిచేయుదువు
బలమును ఘనతను ధరించుకొందువు (2)
రాత్రివేళ నీ దీపము ఆరదు
కాంతికిరణమై మాదిరి చూపుదువు (2) ||అమూల్యమైన||
దీనులకు నీ చేతులు పంచును
దరిద్రులను నీవు ఆదుకొందువు (2)
దూరము నుండి ఆహారము కొనుచు
మంచి భోజనముతో తృప్తిపరచుదువు (2) ||అమూల్యమైన||

amoolyamaina aanimuthyamaa
yehova devuni hasthakruthamaa (2)
apuroopa soundarya raashivi neevu
aathmeeya sugunasheelivi neevu (2) ||amoolyamaina||
gnaanamu kaligi noru therachuduvu
krupagala upadeshamunu cheyuduvu (2)
intivaarini baaguga nadupuchu
vaari mannanalanu ponduchunduvu (2) ||amoolyamaina||
chethulatho balamugaa panicheyuduvu
balamunu ghanathanu dharinchukonduvu (2)
raathrivela nee deepamu aaradhu
kaanthikiranamai maadhiri choopuduvu (2) ||amoolyamaina||
deenulaku nee chethulu panchunu
daridrulanu neevu aadhukonduvu (2)
dooramu nundi aahaaramu konuchu
manchi bhojanamutho thrupthiparachuduvu (2) ||amoolyamaina||


                                
Posted on
  • Song
  • Name :
  • E-mail :
  • Song No

© 2023 Waytochurch.com