avadhule lenidi divyamaina nee krupaఅవధులే లేనిది దివ్యమైన నీ కృప
అవధులే లేనిది దివ్యమైన నీ కృప అనంతమైనది ఆశ్చర్యమైనది (2) యేసయ్యా నాపై నీవు చూపిన కృప అమూల్యమైనది వర్ణించలేనిది (2) ||అవధులే|| ఊహించలేని హృదయానందమును దుఃఖమునకు ప్రతిగా దయచేసినావు (2) భారమెక్కువైనా తీరం కడుదూరమైనా నీపై ఆనుకొందును నేను గమ్యం చేరుకొందును (2) ||అవధులే|| సరిపోల్చలేని మధురమైన అనుభవం వింతైన నీ ప్రేమలో అనుభవింపజేశావు (2) సౌందర్యమైన అతిపరిశుద్ధమైన నీ రూపము తలచుకొందును నేను నీ కోసమే వేచియుందును (2) ||అవధులే|| లెక్కించలేని అగ్ని శోధనలో ప్రయాసమునకు తగిన ఫలములిచ్చినావు (2) వాడబారని కిరీటము నే పొందుటకు వెనుకున్నవి మరచి నేను లక్ష్యము వైపు సాగెద (2) ||అవధులే||
avadhule lenidi divyamaina nee krupa
ananthamainadi aascharyamainadi (2)
yesayyaa naapai neevu choopina krupa
amoolyamainadi varninchalenidi (2) ||avadhule||
oohinchaleni hrudayaanandamunu
dukhamunaku prathigaa dayachesinaavu (2)
bhaaramekkuvainaa theeram kadu dooramainaa
neepai aanukondunu
nenu gamyam cherukondunu (2) ||avadhule||
saripolchaleni madhuramaina anubhavam
vinthaina nee premalo anubhavimpajesaavu (2)
soundaryamaina athi parishuddhamaina
nee roopamu thalachukondunu
nenu nee kosame vechiyundunu (2) ||avadhule||
lekkinchaleni agni shodhanalo
prayaasamunaku thagina phalamulichchinaavu (2)
vaadabaarani kireetamu ne pondutaku
venukunnavi marachi
nenu lakshyamu vaipu saageda (2) ||avadhule||