aapathkaalamuna naaku aashrayamu neeveఆపత్కాలమున నాకు ఆశ్రయము నీవే
ఆపత్కాలమున నాకు ఆశ్రయము నీవే అలసిన క్షణములలో నాకు ఆదరణ నీవే (2) తల్లి కన్నా తండ్రి కన్నా కాచిన దేవా నీకే స్తోత్రం (2) ||ఆపత్కాలమున|| నీవు నన్ను పరిశోధించి పరిశీలించావు నేను లేచి కూర్చుండుటను సమస్తమెరిగితివి (2) ఆకాశమునకు ఎక్కిననూ అక్కడ నీవే ఉన్నావు భూదిగంతములు చుట్టిననూ అక్కడ నీవే ఉన్నావు ఈ విశ్వమంత నీవే మమ్మేలుచున్నావు నీ కన్న దైవమెవరు మా పూజ్యనీయుడా ||ఆపత్కాలమున|| నేను నడచే మార్గమంతటిలో నీ దూతల చేత రాయి తగులక ఎత్తుకొనుమని ఆజ్ఞ ఇచ్చితివి (2) మరణముగుండా వెళ్లిననూ విష సర్పములను తొక్కిననూ చేయి విడువక ఎప్పుడునూ విడనాడక నను ఎన్నడునూ నడిపించుచున్న దేవా నీకెంత ప్రేమ నాపై – (2) ||ఆపత్కాలమున||
aapathkaalamuna naaku aashrayamu neeve
alasina kshanamulalo naaku aadarana neeve (2)
thalli kannaa thandri kannaa
kaachina devaa neeke sthothram (2) ||aapathkaalamuna||
neevu nannu parishodhinchi parisheelinchaavu
nenu lechi kurchundutanu samasthamerigithivi (2)
aakaashamunaku ekkinanu akkada neeve unnaavu
boodiganthamulu chuttinanu akkada neeve unnaavu
ee vishwamantha neeve mammeluchunnaavu
nee kanna daivamevaru maa poojyaneeyudaa ||aapathkaalamuna||
nenu nadache maargamanthatilo nee doothala chetha
raayi thagulaka etthukonumani aagna ichchithivi (2)
maranamugundaa vellinanu visha sarpamulanu thokkinanu
cheyi vuduvaka eppudunu vidanaadaka nanu ennadunu
nadipinchuchunna devaa neekentha prema naapai – (2) ||aapathkaalamuna||