• waytochurch.com logo
Song # 13282

oohinchaleni kaaryamulu devudu jariginchinaaduఊహించలేని కార్యములు దేవుడు జరిగించినాడు



ఊహించలేని కార్యములు దేవుడు జరిగించినాడు
కానానులో మహిమను చూపి కార్యము జరిగించినాడు (2)
దంపతులను దీవించగా బంధువులు విచ్చేసినారు
ఘనమైన కార్యము తిలకించగా ఆత్మీయులే వచ్చినారు
ఆనందమే ఆనందమే ఈ పెళ్లి సంతోషమే
కళ్యాణము కమనీయము కళ్యాణ వైభోగము ||ఊహించలేని||
ఒకరికి ఒకరు ముడి వేసుకొనే బంధం
ఒకరంటే ఒకరికి ప్రేమను పంచే తరుణం (2)
కలవాలి హృదయాలు ఒకటై
పండాలి నూరేళ్లు ఇకపై (2)
వెయ్యేళ్ళు వర్ధిల్లాలని ఇస్తున్నాము ఇవ్వాళ ||ఊహించలేని||
దేవుని సముఖములో బ్రతకాలి మీరు
మీ జీవిత పయనం సాగాలి ఆ దేవునితో (2)
లోబడి ఉండాలి వధువు
ప్రేమను పంచాలి వరుడు (2)
దేవుడిచ్చే బహుమానం మీ కన్నుల పంట కావాలి ||ఊహించలేని||

oohinchaleni kaaryamulu devudu jariginchinaadu
kaanaanulo mahimanu choopi kaaryamu jariginchinaadu (2)
dampathulanu deevinchagaa bandhuvulu vichchesinaaru
ghanamaina kaaryamu thilakinchagaa aathmeeyule vachchinaaru
aanandame aanandame ee pelli santhoshame
kalyaanamu kamaneeyamu kalyaana vaibhogamu ||oohinchaleni||
okariki okaru mudi vesukone bandham
okarante okariki premanu panche tharunam (2)
kalavaali hrudayaalu okatai
pandaali noorellu ikapai (2)
veyyellu vardhillalani isthunnaamu ivaala ||oohinchaleni||
devuni samukhamulo brathakaali meeru
mee jeevitha payanam saagaali aa devunitho (2)
lobadi undaali vadhuvu
premanu panchaali varudu (2)
devudichche bahumaanam mee kannula panta kaavaali ||oohinchaleni||


                                
Posted on
  • Song
  • Name :
  • E-mail :
  • Song No

© 2023 Waytochurch.com