evari kosamo ee praana thyaagamuఎవరి కోసమో ఈ ప్రాణ త్యాగము
ఎవరి కోసమో ఈ ప్రాణ త్యాగము (2) నీ కోసమే నా కోసమే కలువరి పయనం – ఈ కలువరి పయనం (2) ||ఎవరి|| ఏ పాపము ఎరుగని నీకు – ఈ పాప లోకమే సిలువ వేసిందా ఏ నేరము తెలియని నీకు – అన్యాయపు తీర్పునే ఇచ్చిందా (2) మోయలేని మ్రానుతో మోముపైన ఉమ్ములతో నడువలేని నడకలతో తడబడుతూ పోయావా సోలి వాలి పోయావా…. ||ఎవరి|| జీవకిరీటం మాకు ఇచ్చావు – ముళ్ళ కిరీటం నీకు పెట్టాము జీవ జలములు మాకు ఇచ్చావు – చేదు చిరకను నీకు ఇచ్చాము (2) మా ప్రక్కన ఉండి మమ్ము కాపాడుచుండగా నీ ప్రక్కలో బళ్ళెముతో – ఒక్క పోటు పొడిచితిమి తండ్రీ వీరు చేయునదేదో వీరెరుగరు వీరిని క్షమించు, వీరిని క్షమించు అని వేడుకొన్నావా… పరమ తండ్రిని ||ఎవరి||
evari kosamo ee praana thyaagamu (2)
nee kosame naa kosame
kaluvari payanam – ee kaluvari payanam (2) ||evari||
ae paapamu erugani neeku – ee paapa lokame siluva vesindaa
ae neramu theliyani neeku – anyaayapu theerpune ichchindaa (2)
moyaleni mraanutho momu paina ummulatho
naduvaleni nadakalatho thadabaduthu poyaavaa
soli vaali poyaavaa… ||evari||
jeeva kireetam maaku ichchaavu – mulla kireetam neeku pettaamu
jeeva jalamulu maaku ichchaavu – chedu chirakanu neeku ichchaamu (2)
maa prakkana undi mammu kaapaaduchundagaa
nee prakkalo ballemutho – okka potu podichithimi
thandri veeru cheyunadedo veererugaru
veerini kshaminchu, veerini kshaminchu
ani vedukonnaavaa.. . parama thandrini ||evari||