enthati vaadanu nenu yesayyaaఎంతటి వాడను నేను యేసయ్యా
ఎంతటి వాడను నేను యేసయ్యా కొంతైనా యోగ్యుడను కానయ్యా (2) ఇంతగ నను హెచ్చించుటకు ఈ స్థితిలో నన్నుంచుటకు (2) ||ఎంతటి|| ఐశ్వర్యము గొప్పతనమును కలిగించు దేవుడవీవే హెచ్చించువాడవును బలమిచ్చువాడవు నీవే (2) అల్పుడను మంటి పురుగును నన్ను ప్రేమించినావు ప్రాణమును నీ సర్వమును నా కొరకై అర్పించినావు ||ఎంతటి|| నిను వెంబడించువారిని నిజముగ సేవించువారిని నీవుండే స్థలములలో నిలిచే నీ సేవకుని (2) ఎంతో ఘనపరచెదవు ఆశీర్వదించెదవు శత్రువుల కంటె ఎత్తుగా అతని తలను పైకెత్తెదవు ||ఎంతటి|| వినయముగల మనుష్యులను వర్దిల్లజేసెదవు గర్విష్టుల గర్వమునణచి గద్దె నుండి దించెదవు (2) మాదు ఆశ్రయ దుర్గమా మేమంతా నీ వారమే మా శైలము మా కేడెమా మాకున్నదంతా నీ దానమే ||ఎంతటి||
enthati vaadanu nenu yesayyaa
konthainaa yogyudanu kaanayyaa (2)
inthaga nanu hechchinchutaku
ee sthithilo nannunchutaku (2) ||enthati||
aishwaryamu goppathanamunu
kaliginchu devudaveeve
hechchinchuvaadavunu
balamichchuvaadavu neeve (2)
alpudanu manti purugunu
nannu preminchinaavu
praanamunu nee sarvamunu
naa korakai arpinchinaavu ||enthati||
ninu vembadinchuvaarini
nijamuga sevinchuvaarini
neevunde sthalamulalo
niliche nee sevakuni (2)
entho ghanaparachedavu
aasheervadinchedavu
shathruvula kante eththugaa
athani thalanu paikeththedavu ||enthati||
vinayamugala manushyulanu
vardhillajesedavu
garvishtula garvamunanachi
gadde nundi dinchedavu (2)
maadu aashraya durgamaa
memanthaa nee vaarame
maa shailamu maa kedemaa
maakunnadantha nee daaname ||enthati||