enduko devaa inthati premaaఎందుకో దేవా ఇంతటి ప్రేమా
ఎందుకో దేవా ఇంతటి ప్రేమా ఎన్నిక లేని నరుని మీద (2) మమతకు ప్రేమకు అర్హత లేని (2) మంటిపై ఎందుకు ఇంత ప్రేమ ||ఎందుకో|| ఎందుకు పనికిరాని నన్ను ఎన్నుకొంటివి ఎందుకయ్యా (2) ఎంచితివి నీ పుత్రికగా నన్ పెంచితివి నీ కృపతో నన్ను ||ఎందుకో|| సర్వ పాపముల పరిహారి సర్వ జనులకు ఉపకారి (2) శాపము నొందిన దోషి మీద శాశ్వత ప్రేమను చూపితివా ||ఎందుకో|| నాశ మార్గములో బ్రతికిన నన్ను నీతి మార్గముకు పిలిచితివా (2) నిత్యము నీతో యుండుటకు పాపిని నన్ను పిలచితివా ||ఎందుకో||
enduko devaa inthati premaa
ennika leni naruni meeda (2)
mamathaku premaku arhatha leni (2)
mantipai enduku intha prema ||enduko||
enduku panikiraani nannu
ennukontivi endukayyaa (2)
enchithivi nee puthrikagaa nan
penchithivi nee krupatho nannu ||enduko||
sarva paapamula parihaari
sarva janulaku upakaari (2)
shaapamu nondina doshi meeda
shaashwatha premanu choopithivaa ||enduko||
naasha maargamulo brathikina nannu
neethi maargamuku pilichithivaa (2)
nithyamu neetho yundutaku
paapini nannu pilachithivaa ||enduko||