okasaari nee swaramu vinagaaneఒకసారి నీ స్వరము వినగానే
ఒకసారి నీ స్వరము వినగానే ఓ దేవా నా మనసు నిండింది ఒకసారి నీ ముఖము చూడగానే యేసయ్య నా మనసు పొంగింది (2) నా ప్రతి శ్వాసలో నువ్వే ప్రతి ధ్యాసలో నువ్వే ప్రతి మాటలో నువ్వే నా ప్రతి బాటలో నువ్వే (2) ||ఒకసారి|| నీ సిలువ నుండి కురిసింది ప్రేమ ఏ ప్రేమ అయినా సరితూగునా (2) నీ దివ్య రూపం మెరిసింది ఇలలో తొలగించె నాలోని ఆవేదన ||నా ప్రతి|| ఇలలోన ప్రతి మనిషి నీ రూపమే కదా బ్రతికించు మమ్ములను నీ కోసమే (2) తొలగాలి చీకట్లు వెలగాలి ప్రతి హృదయం నడిపించు మమ్ములను నీ బాటలో ||నా ప్రతి||