kanta neerela kalathalu aelaకంట నీరేల కలతలు ఏల
కంట నీరేల? కలతలు ఏల? యేసుతో నీవు సాగు వేళ శోధన వేళ రోదన ఏల? నీ విశ్వసము గెలిచే వేళ (2) నమ్మిన ఆ దేవుడు – ఎన్నడు మరచిపోడు నీయొక్క అవసరాలు – ఏనాడో తానెరిగాడు ||కంట|| వలదు చింతన దేనికైనా విన్నవించుము నీ నివేదన (2) పొందితినను నీదు నమ్మకము దరికి చేర్చును తగిన విజయము (2) తిరుగన్నదే లేనివి – ఆ తండ్రి దీవెనలు పొరపాటు ఎరుగనివి – తానిచ్చు ఆ మేలులు (2) ||కంట|| రేపు గూర్చిన భయము వలదు ప్రతి దినము తగు బాధ కలదు (2) నీదు భారము మోయు ఆ దేవుడు నీకు ముందుగా నడుచు ఎల్లప్పుడు (2) నీలోని ఆ భయము – లోకానికి ప్రతిరూపం స్థిరమైన నీ విశ్వాసం – దేవునికి సంతోషం (2) ||కంట||
kanta neerela? kalathalu aela?
yesutho neevu saagu vela
shodhana vela rodana aela?
ne vishwaasamu geliche vela (2)
nammina aa devudu – ennadu marachipodu
neeyokka avasaraalu – aenaado thaanerigaadu ||kanta||
valadu chinthana denikainaa
vinnavinchumu nee nivedana (2)
pondithinanu needu nammakamu
dariki cherchunu thagina vijayamu (2)
thirugannade lenivi – aa thandri deevenalu
porapaatu eruganivi – thaanichchu aa melulu (2) ||kanta||
repu goorchina bhayamu valadu
prathi dinamu thagu baadha kaladu (2)
needu bhaaramu moyu aa devudu
neeku mundugaa naduchu ellappudu (2)
neeloni aa bhayamu – lokaaniki prathiroopam
sthiramaina nee vishwaasam – devuniki santhosham (2) ||kanta||