koniyaada tharame ninnuకొనియాడ తరమే నిన్ను
కొనియాడ తరమే నిన్ను కోమల హృదయ – కొనియాడ తరమే నిన్ను తనరారు దినకరు – బెను తారలను మించు (2) ఘన తేజమున నొప్పు – కాంతిమంతుడ వీవు ||కొనియాడ|| కెరుబులు సెరుపులు – మరి దూత గణములు (2) నురుతరంబుగ గొలువ – నొప్పు శ్రేష్ఠుడ వీవు ||కొనియాడ|| సర్వ లోకంబుల – బర్వు దేవుడ వయ్యు (2) నుర్వి స్త్రీ గర్భాన – నుద్భవించితి వీవు ||కొనియాడ|| విశ్వమంతయు నేలు – వీరాసనుడ వయ్యు (2) పశ్వాళితో దొట్టి – పండియుంటివి వీవు ||కొనియాడ|| దోసంబులను మడియు – దాసాళి కరుణించి (2) యేసు పేరున జగతి – కేగుదెంచితి నీవు ||కొనియాడ|| నరులయందున కరుణ – ధర సమాధానంబు (2) చిరకాలమును మహిమ – పరగ జేయుదు వీవు ||కొనియాడ|| ఓ యేసు పాన్పుగ – నా యాత్మ జేకొని (2) శ్రేయముగ పవళించు – శ్రీకర వరసుత ||కొనియాడ||
koniyaada tharame ninnu
komala hrudaya – koniyaada tharame ninnu
thanaraaru dinakaru – benu thaaralanu minchu (2)
ghana thejamuna noppu – kaanthimanthuda veevu ||koniyaada||
kherubulu serupulu – mari dootha ganamulu (2)
nurutharambuga goluva – noppu shreshtuda veevu ||koniyaada||
sarva lokambula – barvu devuda vayyu (2)
nurvi sthree garbhaana – nudbhavinchithi veevu ||koniyaada||
vishwamanthayu nelu – veeraasanuda vayyu (2)
pashvaalitho dotti – pandiyuntivi veevu ||koniyaada||
dosambulanu madiyu – daasaali karuninchi (2)
yesu peruna jagathi – kegudenchithi neevu ||koniyaada||
narulayanduna karuna – dhara samaadhaanambu (2)
chirakaalamunu mahima – paraga jeyudu veevu ||koniyaada||
o yesu paanpuga – naa yaathma jekoni (2)
shreyamuga pavalinchu – shreekara varasutha ||koniyaada||