dikkulanni neevele dikkulanni neeveleదిక్కులన్ని నీవేలే దిక్కులన్ని నీవేలే
దిక్కులన్ని నీవేలే – దిక్కులన్ని నీవేలే (2) ఎక్కడో నిన్ను వెదక – ఏలనయ్య ఓ స్వామీ (2) నిత్యమై నాలోన – జీవమై నీవుండ ||దిక్కులన్ని|| లెక్క మిక్కిలి ప్రాణులెన్నో ఈ జగతినుండగా లెక్క మాలిన నన్ను నీవు నీ పోలిక చేయగా (2) నిక్కముగా నర జన్మ – ధన్య చరితాయనే (2) చక్కనయ్య త్యాగానాన – చావు కూడా సత్తేలే ||దిక్కులన్ని|| దిక్కులేని దారిలోన నన్ను నీవు నడుప దిక్కు నీవై ప్రక్కనుండి మొక్కుచుందు దేవా (2) భాష రాని నా నోట – పాడుకుందు నీ పాట (2) హీనమైన రూపానాన – గానమై యేసన్న ||దిక్కులన్ని||
dikkulanni neevele – dikkulanni neevele (2)
ekkado ninnu vedala – aelanayya o swaami (2)
nithyamai naalona – jeevamai neevunda ||dikkulanni||
lekka mikkili praanulenno ee jagathinundagaa
lekka maalina nannu neevu nee polika cheyagaa (2)
nikkamuga nara janma – dhanya charithaayene (2)
chakkanayya thyaagaanaana – chaavu kooda satthele ||dikkulanni||
dikku leni daarilona nannu neevu nadupa
dikku neevai prakkanundi mokkuchundu devaa (2)
bhaasha raani naa nota – paadukundu nee paata (2)
heenamaina roopaanaana – gaanamaina yesanna ||dikkulanni||