dikkulenni thiriginaa ae dikku vedakinaaదిక్కులెన్ని తిరిగినా ఏ దిక్కు వెదకినా
దిక్కులెన్ని తిరిగినా – ఏ దిక్కు వెదకినా (2) మనకు దిక్కు ఈ బాల యేసుడే ఈ ధరణిలో – జోల పాట పాడ రారండయ్యో ఓ జనులారా – మీ హృదయంలో నివసింప జేయండయ్యో (2) కన్య గర్భమందు నేడు – కరుణగల రక్షకుండు (2) స్థలము లేక తిరిగి వేసారెను నా కొరకై స్థలము సిద్ధ పరచ నేడు పుట్టెను (2) కల్లబొల్లి కథలు కావు – ఆ గొల్ల బొయల దర్శనంబు (2) నేడు నోవాహు ఓడ జోరేబు కొండ గుర్తుగా ఉన్నాయి చూడండి ||దిక్కులెన్ని|| దిక్కులేని వారినెల్ల – పాపమందు బ్రతికేటోళ్ల (2) తన మార్గమందు నడుప బుట్టెను ఈ బాలుడు చెడ్డ వారినెల్ల చేరదీయును (2) జన్మించాడు నేడు – ఈ విశ్వ మొత్తమునేలు రాజు (2) నేడు తూర్పు దిక్కు జనులందరు వచ్చి హృదయాలు అర్పించినారయ్యో ||దిక్కులెన్ని||