divinelu sthothraarhudaa yesayyaaదివినేలు స్తోత్రార్హుడా యేసయ్యా
దివినేలు స్తోత్రార్హుడా యేసయ్యా దిగి రానైయున్న మహరాజువు నీవయ్యా మొదటివాడవు – కడపటివాడవు యుగయుగములలో ఉన్నవాడవు (2) మానక నా యెడల కృప చూపుచున్నావు మారదు నీ ప్రేమ తరతరములకు (2) మాట తప్పని మహనీయుడవు – మార్పులేని వాడవు నీవు చెప్పిన మంచి మాటలు – నెరవేర్చువాడవు నీ మాటలు జీవపు ఊటలు నీ కృపలే బలమైన కోటలు (2) ||దివినేలు|| దాచక నీ సంకల్పము తెలియజేయుచున్నావు దయనొందిన నీ జనుల ముందు నడుచుచున్నావు (2) దాటి వెళ్లని కరుణామూర్తివై – మనవి ఆలకించావు దీర్ఘ శాంతముగలవాడవై – దీవించువాడవు నీ దీవెన పరిమళ సువాసన నీ ఘనతే స్థిరమైన సంపద (2) ||దివినేలు|| సీయోను శిఖరముపై నను నిలుపుటకే జ్యేష్ఠుల సంఘముగా నను మార్చుటకే (2) దివ్యమైన ప్రత్యక్షతతో – నన్ను నింపియున్నావు సుందరమైన నీ పోలికగా – రూపు దిద్దుచున్నావు నీ రాజ్యము పరిశుద్ధ నగరము ఆ రాజ్యమే నిత్య సంతోషము (2) ||దివినేలు||
divinelu sthothraarhudaa yesayyaa
digi raanaiyunna maharaajuvu neevayyaa
modativaadavu – kadapativaadavu
yugayugamulalo unnavaadavu (2)
maanaka naa yedala krupa choopuchunnaavu
maaradu nee prema tharatharamulaku (2)
maata thappani mahaneeyudavu – maarpuleni vaadavu
neevu cheppina manchi maatalu – neraverchuvaadavu
nee maatalu jeevapu ootalu
nee krupale balamaina kotalu (2) ||divinelu||
daachaka nee sankalpamu theliyajeyuchunnaavu
dayanondina nee janula mundu naduchuchunnaavu (2)
daati vellani karunaamoorthivai – manavi aalakinchaavu
deergha shaanthamugalavaadavai – deevinchuvaadavu
nee deevna parimala suvaasana
nee ghanathe sthiramaina sampada (2) ||divinelu||
seeyonu shikharamupai nanu niluputake
jyeshtula sanghamugaa nanu maarchutake (2)
divyamaina prathyakshathatho – nannu nimpiyunnaavu
sundaramaina nee polikagaa – roopu didduchunnaavu
nee raajyamu parishuddha nagaramu
aa raajyame nithya santhoshamu (2) ||divinelu||