• waytochurch.com logo
Song # 13363

devuni sthuthiyinchi aaraadhinthumuదేవుని స్తుతియించి ఆరాధింతుము



దేవుని స్తుతియించి ఆరాధింతుము
మన దేవుని ఆరాధించి ఆనందింతుము (2)
రండీ ఓ జనులారా
సర్వలోక నివాసులారా (2)
సంతోషగీతము పాడెదము (2)
ఆహా.. ఆరాధనా.. – హల్లెలూయా ఆరాధనా… (2) ||దేవుని||
వేటకాని ఉరిలో నుండి ఆయనే నిన్ను విడిపించును
భారమైన నీ బాధలను ఆయనే ఇక తొలగించును (2)
ఏ తెగులు నీ ఇల్లు దరిచేరదు (2)
ఆయనే రక్షించును ||రండీ ఓ||
బండ చీల్చి నీళ్ళను ఇచ్చి ఇశ్రాయేలీయులను కాచెను
నింగి నుంచి మన్నాను పంపి వారి ప్రాణము రక్షించెను (2)
శత్రువుల చెర నుంచి విడిపించెను (2)
తోడుండి నడిపించెను ||రండీ ఓ||
మన విరోధి చేతిలోనుండి ఆయనే మనను తప్పించును
కష్టకాల ఆపదలన్ని ఆయనే ఇక కడతేర్చును (2)
వేదనలు శోధనలు ఎదిరించగా (2)
శక్తిని మనకిచ్చునూ ||రండీ ఓ||
కన్నవారు ఆప్తులకంటే ఓర్పుగా మనను ప్రేమించును
భూమికంటే విస్తారముగా ప్రేమతో మనను దీవించును (2)
ఆ ప్రభువు రక్షకుడు తోడుండగా (2)
దిగులే మనకెందుకు ||రండీ ఓ||

devuni sthuthiyinchi aaraadhinthumu
mana devuni aaraadhinchi aanandinthumu (2)
randee o janulaara
sarvaloka nivaasulaara (2)
santhosha geethamu paadedamu (2)
aahaa.. aaraadhanaa – hallelooyaa aaraadhanaa (2) ||devuni||
vetakaani urilo nundi aayane ninnu vidipinchunu
bhaaramaina nee baadhalanu aayane ika tholaginchunu (2)
ae thegulu nee illu dari cheradu (2)
aayane rakshinchunu ||randee o||
banda cheelchi neellanu icchi ishraayeleeyulanu kaachenu
ningi nunchi mannaanu pampi vaari praanamu rakshinchenu (2)
shathruvula chera nunchi vidipinchenu (2)
thodundi nadipinchenu ||randee o||
mana virodhi chethilo nundi aayane mananu thappinchunu
kashta kaala aapadalanni aayane ika kada therchunu (2)
vedanalu shodhanalu edirinchagaa (2)
shakthini manakichchunu ||randee o||
kanna vaaru aapthula kante orpugaa mananu preminchunu
bhoomi kante visthaaramugaa prematho mananu deevinchunu (2)
aa prabhuvu rakshakudu thodundagaa (2)
digule manakenduku ||randee o||


                                
Posted on
  • Song
  • Name :
  • E-mail :
  • Song No

© 2023 Waytochurch.com