nashiyinchedi lokamlo vasiyinchavu kala kaalamనశియించెడి లోకంలో వసియించవు కలకాలం
నశియించెడి లోకంలో – వసియించవు కలకాలం మేలైనది చేపట్టి – సాగించు నీ పయనం – (2) అది నాదంటూ ఇది నాదంటూ – ఆనందం కోల్పోతూ పరమార్ధం గ్రహియించకనే – గతియించిపోతావా ||నశియించెడి|| కాలంతో పాటుగా కృశియించును శరీరం మరణం కబళించును ఏ ఘడియలోనైనా (2) క్రీస్తు దారిలో సాగి – నిత్య రాజ్యమే చేరి (2) వసియించు కలకాలం – సత్యమైన లోకంలో ||నశియించెడి|| నిలచిపోవును మహిలోన బంధాలన్ని మట్టిలో కలియును దేహం రిక్త హస్తాలతో (2) ఇకనైనా తేరుకొని – గ్రహియించు సత్యాన్ని (2) యేసులోకి మళ్ళించు – నీ జీవిత గమనాన్ని ||నశియించెడి||