naa oohakandani prematho nannu neevu pilichaavuనా ఊహకందని ప్రేమతో నన్ను నీవు పిలిచావు
నా ఊహకందని ప్రేమతో నన్ను నీవు పిలిచావు ఆ ప్రేమలోనే నన్ను నీలోనే నిలిపావు (2) నాలోన నీవున్నావు – నీలోన నను దాచావు నీ సాక్షిగా నను నిలిపావు (2) ||నా ఊహకందని|| అందరు నన్ను చూచి నీ బ్రతుకు మారదని దూరాన నిలచి నన్ను చూచి నవ్వారే (2) ఏనాడు అనుకోలేదు నన్ను నీవు ఎన్నుకుంటావని (2) ||నా ఊహకందని|| జీవితమంతా శూన్యమైపోగా నాకున్న వారే నన్ను విడచిపోగా (2) ఏనాడు అనుకోలేదు నాకు తోడుగా నీవుంటావని (2) ||నా ఊహకందని|| నా జీవితాన్ని నీవు మార్చినావు నీ సేవలోనే నన్ను నిల్పినావు (2) ఏనాడు అనుకోలేదు నా జీవితం ఇలా మారుతుందని (2) ||నా ఊహకందని||