naadu jeevithamu maaripoyinadiనాదు జీవితము మారిపొయినది
నాదు జీవితము మారిపొయినది నిన్నాశ్రయించిన వేళ నన్నాదుకుంటివి ప్రభువా ||నాదు|| చాలునయ్యా దేవా – ఈ జన్మ ధాన్యమే ప్రభువా (2) పాప కూపము విడిచి – నీ దారి నడచితి దేవా నిన్నాశ్రయించితి ప్రభువా.. ||నాదు|| కన్ను గానని దిశగా – బహు దూరమేగితినయ్యా (2) నీ ప్రేమ వాక్యము వినగా – నా కళ్ళు కరిగెను దేవా నిన్నాశ్రయించితి ప్రభువా.. ||నాదు|| లోకమంతా విషమై – నరకాగ్ని జ్వాలలు రేగే (2) ఆ దారి నడపక నన్ను – కాపాడినావని దేవా నిన్నాశ్రయించితి ప్రభువా.. ||నాదు|| జాలిగల నా ప్రభువా – నీ చేయి చాపవా ప్రభువా (2) చేరగల నీ దరికి – నే పాపినయ్యా ప్రభువా నే పాపినయ్యా ప్రభువా.. ||నాదు|| ఆరిపోని జ్యోతివై – కన్నులలోని కాంతివై (2) ఎంత కాలముంటివి – ఎంతగా ప్రేమించితివి నన్నెంతగా ప్రేమించితివి.. ||నాదు||
naadu jeevithamu maaripoyinadi
ninnaashrayinchina vela
nannaadukuntivi prabhuvaa ||naadu||
chaalunayyaa devaa – ee janma dhanyame prabhuvaa (2)
paapa koopamu vidichi – nee daari nadachithi devaa
ninnaashrayinchithi prabhuvaa.. ||naadu||
kannu gaanani dishagaa – bahu dooramegithinayyaa (2)
nee prema vaakyamu vinagaa – naa kallu karigenu devaa
ninnaashrayinchithi prabhuvaa.. ||naadu||
lokamanthaa vishamai – narakaagni jvaalalu rege (2)
aa daari nadapaka nannu – kaapaadinaavani devaa
ninnaashrayinchithi prabhuvaa.. ||naadu||
jaaligala naa prabhuvaa – nee cheyi chaapavaa prabhuvaa (2)
cheragala nee dariki – ne paapinayyaa prabhuvaa
ne paapinayyaa prabhuvaa.. ||naadu||
aariponi jyothivai – kannulaloni kaanthivai (2)
entha kaalamuntivi – enthagaa preminchithivi
nannenthagaa preminchithivi.. ||naadu||