ninnu thalachi nanu nenu marachiనిన్ను తలచి నను నేను మరచి
నిన్ను తలచి నను నేను మరచి నీ సాక్షిగా ఇల నే బ్రతుకుచుంటిని (2) యేసయ్యా.. నీ కృప లేక నే బ్రతుకలేను (2) ||నిను తలచి|| జీవము లేని దైవారాధనలో నిర్జీవ క్రియలతో మృతుడనైతిని (2) జీవాధిపతివై నా జీవితానికి నిత్య జీవము నొసగిన యేసయ్యా (2) ||నిను తలచి|| దారే తెలియని కారు చీకటిలో బ్రతుకే భారమై నలిగిపోతిని (2) నీతి సూర్యుడా ఎదలో ఉదయించి బ్రతుకే వెలుగుతో నింపిన యేసయ్యా (2) ||నిను తలచి|| సద్గుణ శీలుడా సుగుణాలు చూచి హృదిలో నేను మురిసిపోతిని (2) సుగుణాలు చూచుటకే నీవు సిలువలో నాకై నలిగిన యేసయ్యా (2) ||నిను తలచి||