nibbaramutho naa yesuke sthuthi paadedaaనిబ్బరముతో నా యేసుకే స్తుతి పాడెదా
నిబ్బరముతో నా యేసుకే స్తుతి పాడెదా వేకువనే లేచి నా ప్రభునే కొనియాడెదా (2) యేసయ్యా… యేసయ్యా… స్తుతులకు పాత్రుడవు నీవయ్యా యేసయ్యా… యేసయ్యా… మాహిమ ఘనతలు నీకయ్యా (2) ||నిబ్బరముతో|| కష్టకాలమందు నాకు – కనికరము చూపెను కాలుజారుతున్నవేళ – కరుణతో నిలిపెను (2) కడుపు కాలుతున్నవేళ – నా కడుపు నింపెను కన్నిటి బ్రతుకును – నాట్యముగా మార్చెను కఠినమైన కాలములో – నా చెంత నిలిచెను ||యేసయ్యా|| దిక్కుదెసలేని నాకు – దర్శనము నిచ్చెను ధనము ఘనము లేని నాకు ఘనతనెంతో నిచ్చెను (2) దిక్కుతోచని వేళ – నా దిక్కై నిలిచెను దుష్ట శక్తులన్నిటిని – నాకు దూరపరచెను దీవెనలు కుమ్మరించి – ధన్యునిగా చేసెను ||యేసయ్యా||
nibbaramutho naa yesuke sthuthi paadedaa
vekuvane lechi naa prabhune koniyaadedaa (2)
yesayyaa.. yesayyaa.. sthuthulaku paathrudavu neevayyaa
yesayyaa.. yesayyaa.. mahima ghanathalu neekayyaa (2) ||nibbaramutho||
kashta kaalamandu naaku – kanikaramu choopenu
kaalu jaaruthunna vela – karunatho nilipenu (2)
kadupu kaaluthunna vela – naa kadupu nimpenu
kanneeti brathukunu – naatyamugaa maarchenu
katinamaina kaalamulo – naa chentha nilichenu ||yesayyaa||
dikku desa leni naaku – darshanamu nichchenu
dhanamu ghanamu leni naaku – ghanathanentho nichchenu (2)
dikku thochani vela – naa dikkai nilichenu
dushta shakthulannitini – naaku dooraparachenu
deevenalu kummarinchi – dhanyunigaa chesenu ||yesayyaa||