ningilo devudu ninu chooda vachchaaduనింగిలో దేవుడు నిను చూడ వచ్చాడు
నింగిలో దేవుడు నిను చూడ వచ్చాడు ఆ నీతి సూర్యుడు శ్రీ యేసు నాధుడు (2) చెంత చేరి సంతసించుమా (2) స్వంతమైన క్రీస్తు సంఘమా ||నింగిలో|| పాపాల పంకిలమై శోకాలకంకితమై మరణించి మన కోసం కరుణించి ఆ దైవం (2) దీన జన రక్షకుడై దేవ దేవుని సుతుడై (2) జన్మించె నీ కోసం ధన్యము చేయగా (2) ||నింగిలో|| సాతాను శోధనలే శాపాల వేదనలై విలపించే దీనులకై అలరించు దీవెనలై (2) శరణమై ఉదయించే తరుణమౌ ఈ వేళ (2) గుండె గుడి పానుపులో చేర్చుకొన రావేల (2) ||నింగిలో||