nee premaku saati lene leduనీ ప్రేమకు సాటి లేనే లేదు
నీ ప్రేమకు సాటి లేనే లేదు ప్రేమారూపా యేసురాజా (2) నింగియందునా – నేల యందునా పాతాళమందునా – ఎందైన గాని (2) నీకన్నా అధికులు ఎవరు లేనే లేరు ||నీ ప్రేమకు|| పాపినైన నా కొరకు – పరలోకం విడచినదెవరు నా పాపముల కొరకై – సిలువలో మరణించినదెవరు (2) క్షమియించి రక్షించిన నా తండ్రి నీవే ||నీ ప్రేమకు|| ధరలోని ధన ధాన్యములు – నన్ను వీడినా ఇలలో నా సరివారు – త్రోసివేసినా (2) ఇహమందు పరమందు నా ధనము నీవే ||నీ ప్రేమకు||