nede priyaraagam palike nava geethamనేడే ప్రియరాగం పలికే నవ గీతం
నేడే ప్రియరాగం పలికే నవ గీతం ప్రేమే మన కోసం వెలసే లోకాన శాంతి మురిసింది మన మనసుల్లో రాగాల కాంతి విరిసింది ||నేడే|| దివినేలు దేవుడు ఉదయించగానే ఇలలోన ప్రకృతి పులకించెగా పరలోక దూతలు స్తుతియించగానే జగమంతా ఉప్పొంగి నర్తించెగా ||నేడే|| మనిషైన సుతుడు జనియించగానే విశ్వాన గోళాలు విభవించెగా చిన్నారి యేసుని చిరునవ్వుతోనే నవ కాంతి లోకాన ప్రభవించెగా ||నేడే|| హ్యాప్పీ క్రిస్మస్ మెర్రీ క్రిస్మస్ హ్యాప్పీ క్రిస్మస్ టు యు… లోకాన శాంతి మురిసింది మన మనస్సులో రాగాల కాంతి విరిసింది