kuthuhala marbhatame కుతూహల మార్భాటమే నా యేసుని సన్నిధిలో
పల్లవి: కుతూహల మార్భాటమే - నా యేసుని సన్నిధిలో ఆనంద మానందమే - నా యేసుని సన్నిధిలో ...కుతూహల... 1. పాపమంత పోయెను - రోగమంత తొలగెను యేసుని రక్తములో క్రీస్తునందు జీవితం - కృప ద్వార రక్షణ పరిశుద్ధాత్మలో (2X) ...కుతూహల... 2. దేవాది దేవుడు ప్రతిరోజు నివసించె దేవాలయం నేనే ఆత్మలోన దేవుడు - గుర్తించె నన్ను అద్భుత మద్భుతమే (2X) ...కుతూహల... 3. శక్తినిచ్చు యేసు - జీవమిచ్చు యేసు జయంపై జయమిచ్చును ఏకముగా కూడి, హోసన్న పాడి - ఊరంత చాటెదము (2X) ...కుతూహల... 4. భూరధ్వనితో పరిశుద్ధులతో - యేసు రానైయుండె ఒక్క క్షణములోనె, రూపాంతరము పొంది - మహిమలో ప్రవేశిద్దాం (2X) ...కుతూహల...