paathaalamlo aathmala aartha naadamపాతాళంలో ఆత్మల ఆర్తనాదం
పాతాళంలో ఆత్మల ఆర్తనాదం భూలోకంలో సువార్తల సునాదము (2) మించుతుంది సమయం – పొంచి ఉంది ప్రమాదం ఎంచుకో స్వర్గం – నరకం (2) గమనించుకో ఎటు నీ పయనం ||పాతాళంలో|| ఆరని అగ్ని తీరని బాధ పాతాళమందున్నది విందు వినోదం బంధువు బలగం ఈ లోకమందున్నది (2) రక్షణను పొందమంటే పొందుకోరు ఇక్కడ రక్షించే వారులేక రోధిస్తారక్కడ (2) ||పాతాళంలో|| ఇది రంగుల లోకం హంగులు చూపి రమ్మని పిలుస్తున్నది వాక్యము ద్వారా దేవుడు పిలచినా ఈ లోకం వినకున్నది (2) ప్రజల కొరకు పాతాళం నోరు తెరుచుకున్నది ఎంత చెప్పినా లోకం కళ్ళు తెరవకున్నది (2) ||పాతాళంలో||
paathaalamlo aathmala aartha naadam
bhoo lokamlo suvaarthala sunaadamu (2)
minchuthundi samayam – ponchi undi pramaadam
enchuko swargam – narakam (2)
gamaninchuko etu nee payanam ||paathaalamlo||
aarani agni theerani baadha paathaalamandunnadi
vindu vinodam bandhuv balagam ee lokamandunnadi (2)
rakshananu pondmante pondukoru ikkada
rakshinche vaaru leka rodhisthaarakkada (2) ||paathaalamlo||
idi rangula lokam hangulu choopi rammani pilusthunnadi
vaakyamu dwaaraa devudu pilachinaa ee lokam vinakunnadi (2)
prajala koraku paathaalam noru theruchukunnadi
entha cheppinaa lokam kallu theravakunnadi (2) ||paathaalamlo||