paapamerugani paavanaathmuniపాపమెరుగని పావనాత్ముని
పాపమెరుగని పావనాత్ముని పరిహసించుట న్యాయమా (2) దోషమెరుగని దీన బాంధుని (2) దోషి చేయుట ధర్మమా – ధర్మమా ||పాపమెరుగని|| మోయరాని పాప భారము మోపినారు సిలువపై (2) గాయమొంది బాధకోర్చి వేదననొంది ప్రాణమిచ్చుట నేరమా (2) నేరమా ||పాపమెరుగని|| జీవ జలముల త్రోవ చూపి బ్రోవ నాత్మల దాహమొందె (2) చావొంది ఆగమై బలి దానమై జీవమిచ్చుట ఘోరమా (2) ఘోరమా ||పాపమెరుగని||