premalo paddaanu… nenu premalo paddaanu…ప్రేమలో పడ్డాను… నేను ప్రేమలో పడ్డాను…
ప్రేమలో పడ్డాను… నేను ప్రేమలో పడ్డాను… ప్రేమలో పడ్డాను నేను ప్రేమలో పడ్డాను నా యేసు ప్రభుని ప్రేమలో పడ్డాను ప్రేమలో ఉన్నాను నేను ప్రేమలో ఉన్నాను నా యేసు ప్రభుతో ప్రేమలో ఉన్నాను స్వార్ధ్యం కలిగిన ప్రేమ కాదు – లాభం కోరే ప్రేమ కాదు కొద్ది కాలమే ఉండే ప్రేమ కాదు – ఆహ శాశ్వతమైన యేసుని ప్రేమ మోహం కలిగిన ప్రేమ కాదు – మోసం చేసే ప్రేమ కాదు పై అందం చూసే ప్రేమ కాదు – పరిశుద్ధమైన ప్రేమ ఇదే కదా ప్రేమంటే – (2) ఈ లోక ప్రేమ కాదు అగాపే ప్రేమ దేవుని ప్రేమ ఇది ||ప్రేమలో|| మొదటగా ప్రపోజ్ చేసింది నేను కాదు నా ప్రియుడే తన ప్రేమ వ్యక్తపరిచే మొదటగా ప్రేమించింది నేను కాదు నా యేసే తన ప్రేమ వ్యక్తపరిచే కోరినాడు పిలిచినాడు – నేను ఎదో మంచి వ్యక్తినైనట్టు కుమ్మరించే ప్రేమ మొత్తం – నేను తప్ప ఎవ్వరు లేనట్టు ఆకశాన తనలో తాను – పరిపూర్ణునిగా ఉన్న ప్రభువుకు భువిలో నాపై ప్రేమ ఎందుకో ఏమి తిరిగి ఇవ్వలేని – ఈ చిన్న జీవి పైన ప్రభువుకు అంత ప్రేమ దేనికో హే… ఇంత గొప్ప ప్రేమ రుచి చూసాక నేను ప్రేమించకుండ ఎట్లా ఉంటాను అంత గొప్ప ప్రేమ చూపు ప్రేమికునికి ఐ లవ్ యు చెప్పకుండ ఎట్లగుంటాను ||ఇదే కదా|| తన ప్రేమకు ఋజువేంటని నేనడుగక ముందే నా ప్రియుడు తన ప్రేమ రుజువు పరిచె ప్రేమకు ఋజువేంటని నేనడగక మునుపే నా యేసు తన ప్రేమ రుజువు పరిచె పాపమనే కూపమందు – నేను బంధీనైయుండఁగా పాపమనే అప్పు చేత – బానిసై నేను అలసియుండగా గగనపు దూరము దాటి వచ్చి – సిలువలో చేతులు పార చాపి నువ్వంటే నాకింత ప్రేమనే రక్తముతో నను సంపాదించి – నా కళ్ళల్లో కళ్ళు పెట్టి నీపై పిచ్చి ప్రేమ నాకనే హే… నన్ను తన సొత్తు చేసుకున్నాడు నా పాప కట్లు తెంపి స్వేచ్ఛనిచ్చాడు మరల వచ్చి పెళ్లి చేసుకుంటాడు అని నిశ్చితార్ధం చేసుకొని వెళ్ళాడు ||ఇదే కదా|| ప్రేమతో నా ప్రియుడు రాసెను ప్రేమ లేఖ వాక్యమనే పరిశుద్ధ ప్రేమ లేఖ ప్రేమతో నా యేసు రాసెను ప్రేమ లేఖ వాక్యమనే పరిశుద్ధ ప్రేమ లేఖ ఆ లేఖ చదువుతుంటే – నా ప్రియుని తలపులు నాలో నిండే ప్రభుని ప్రేమ లోతు తెలిసి – నా యేసుపై పొంగి పొరలే రేయింబవలు ప్రభు కావాలని – తనతో ఎప్పుడు కలిసుండాలని నా ప్రాణము పరి తపియించెనే యుగయుగములు నన్నేలేడివాడు – అని త్వరలోనే రానున్నాడని ఆత్మలో కలిగే ప్రేమ పరవశమే హే… వింత అయిన ఆ యేసు ప్రేమ గూర్చి నేను సర్వ లోకమునకు చాటి చెబుతాను యేసు రక్తమందు శుద్ధులైన వారే ఆ ప్రేమ రాజ్యమందు ఉందురంటాను ||ఇదే కదా||
premalo paddaanu… nenu premalo paddaanu…
premalo paddaanu nenu premalo paddaanu
naa yesu prabhuni premalo paddaanu
premalo unnaanu nenu premalo unnaanu
naa yesu prabhutho premalo unnaanu
swaardhyam kaligina prema kaadu
laabham kore prema kaadu
koddi kaalame unde prema kaadu
aaha shaahswathamaina yesuni prema
moham kaligina prema kaadu
mosam chese prema kaadu
pai andam choose prema kaadu
parishuddhamaina prema
ide kadaa premante – (2)
ee loka prema kaadu agaape prema
devuni prema idi ||premalo||
modatagaa propose chesindi nenu kaadu
naaa priyude thana prema vyakthapariche
modatagaa preminchindi nenu kaadu
naa yese thana prema vyakthapariche
korinaadu pilichnaadu – nenu edo manchi vyakthinainattu
kummarinche prema mottham – nenu thappa evvaru lenattu
aakashaana thanalo thaanu – paripoornunigaa unna prabhuvuku
bhuvilo naapai prema enduko
emi thirigi ivvaleni – ee chinna jeevi paina
prabhuvuku antha prema deniko
hey… intha goppa prema ruchi choosaaka
nenu preminchakunda etla untaanu
antha goppa prema choopu premikuniki
i love you cheppakunda etlaguntaanu ||ide kadaa||
thana premaku rujuventani nenadugaka munde
naa priyudu thana prema rujuvu pariche
premaku rujuventani nenadagaka munupe
naa yesu thana prema rujuvu pariche
paapamane koopamandu – nenu bandheenaiyundangaa
paapamane appu chetha – baanisai nenu alasiyundagaa
gaganapu dooramu daati vachchi – siluvalo chethulu paara chaapi
nuvvante naakintha premane
rakthamutho nanu sampaadinchi – naa kallallo kallu petti
neepai pichchi prema naakane
hey… nannu thana sotthu chesukunnaadu
naa paapa katlu thempi swechchanichchaadu
marala vachchi pelli chesukuntaadu
ani nischithaardham chesukoni vellaadu ||ide kadaa||
prematho naa priyudu raasenu prema lekha
vaakyamane parishuddha prema lekha
prematho naa yesu raasenu prema lekha
vaakyamane parishuddha prema lekha
aa lekha chaduvuthunte – naa priyuni thalapule naalo ninde
prabhuni prema lothu thelisi – naa yesupai pongi porale
reyimbavalu prabhu kaavaalni – thanatho eppudu kalisundaalani
naa praanamu pari thapiyinchene
yugayugamulu nanneledivaadu – ani thvaralone raanunnaadani
aathmalo kalige prema paravashame
hey… vintha aina aa yesu prema goorchi
nenu sarva lokamunaku chaati chebuthaanu
yesu rakthamandu shuddhulaina vaare
aa prema raajyamandu undurantaanu ||ide kadaa||