manchi snehithudaa manchi kaapariviమంచి స్నేహితుడా మంచి కాపరివి
మంచి స్నేహితుడా మంచి కాపరివి (2) అగాధ జలములలో నేను నడచినను అరణ్య యానములో నేను తిరిగినను నన్ను ఆదరించినావు ఓదార్చినావు చేర దీసినావు కాపాడినావు (2) నీకే ఆరాధన – నీకే ఆరాధన (2) ఆరాధన ఆరాధన – ఆరాధన నీకే ఆరాధన (2) తప్పిపోయిన నన్ను వెదకి రక్షించినావు ఆశ్చర్యమైన నీ వెలుగులోనికి నన్ను పిలచుచున్నావు (2) ఘనమైన పరిచర్యను నాకు దయచేసినావు ప్రధాన కాపరిగా నన్ను నడిపించినావు ||ఆరాధన|| చెరలో ఉన్న నన్ను విడుదల చేసినావు బంధింపబడియున్న నన్ను విముక్తి ప్రకటించినావు (2) నాలో ఉన్న నిన్ను లోకానికి చూపినావు నీలో ఉన్న నన్ను నీ సాక్షిగా నిలిపినావు ||ఆరాధన|| ఒంటరియైన నన్ను వేయిమందిగా చేసితివి ఎన్నిక లేని నన్ను బలమైన జనముగా మార్చితివి (2) నన్ను హెచ్చించినావు నా కొమ్ము పైకెత్తినావు (2) ||ఆరాధన||
manchi snehithudaa manchi kaaparivi (2)
agaadha jalamulalo nenu nadachinanu
aranya yaanamulo nenu thiriginanu
nannu aadarinchinaavu odaarchinaavu
chera dessinaavu kaapaadinaavu (2)
neeke aaraadhana – neeke aaraadhana (2)
aaraadhana aaraadhana
aaraadhana neeke aaraadhana (2)
thappipoyina nannu vedaki rakshinchinaavu
aascharyamaina nee veluguloniki nannu pilachuchunnaavu (2)
ghanamaina paricharyanu naaku dayachesinaavu
pradhaana kaaparigaa nannu nadipinchinaavu ||aaraadhana||
cheralo unna nannu vidudala chesinaavu
bandhimpabadiyunna nannu vimukthi prakatinchinaavu (2)
naalo unna ninnu lokaaniki choopinaavu
neelo unna nannu nee saakshigaa nilipinaavu ||aaraadhana||
ontariyaina nannu veyimandiga chesithivi
ennika leni nannu balamaina janamuga maarchithivi (2)
nannu hechchinchinaavu naa kommu paiketthinaavu (2) ||aaraadhana||