maargamu neevani gamyamu neevaniమార్గము నీవని గమ్యము నీవని
మార్గము నీవని – గమ్యము నీవని – (2) నమ్మితి గనుక ఓ యేసు నాథా సుగమమాయెనే జీవ యాత్ర ప్రాణము నీవని – దేహము నీదని – (2) నమ్మితి గనుక ఓ యేసు నాథా చైతన్యమొందెనే జీవ యాత్ర బాధల బరువులో – నిత్య నిరాశలో శోధన వేళలో సత్య సాక్ష్యమునీయగా (2) శాంతము నీవని – స్వస్థత నీవని (2) నమ్మితి గనుక ఓ యేసు నాథా ఆనందమాయెనే జీవ యాత్ర ||మార్గము|| ప్రార్థన వేళలో – ఆద్రత మీరగా గొంతు మూగదై – భక్తి కన్నుల జాలగా (2) ధాత్రము నీవని – స్తోత్రము నీవని (2) నమ్మితి గనుక ఓ యేసు నాథా సంగీతమాయెనే జీవ యాత్ర ||మార్గము||