yesu rakshakaa shathakoti sthothramయేసు రక్షకా శతకోటి స్తోత్రం
యేసు రక్షకా శతకోటి స్తోత్రం జీవన దాత కోటి కోటి స్తోత్రం యేసు భజియించి పూజించి ఆరాధించెదను (2) నా సమస్తము అర్పించి ఆరాధించెదను (2) యేసు ఆరాధించెదను – ఆరాధించెదను శౌర్యుడు నా ప్రాణ ప్రియుడు నన్ను రక్షింప నర రూపమెత్తాడు (2) నా సిల్వ మోసి నన్ను స్వర్గ లోకమెక్కించాడు (2) చల్లని దేవుడు నా చక్కని యేసుడు (2) ||యేసు రక్షకా|| పిలిచినాడు నీవే నా సొత్తన్నాడు ఎన్నటికిని ఎడబాయనన్నాడు (2) తన ప్రేమ చూప నాకు నేల దిగినాడు (2) నా సేద దీర్చి నన్ను జీవింపజేసాడు (2) ||యేసు రక్షకా|| యేసు ఆరాధించెదను – ఆరాధించెదను నా సమస్తము అర్పించి – ఆరాధించెదను నా సర్వము అర్పించి – ఆరాధించెదను శరణం శరణం యేసు స్వామి శరణం (3) ||యేసు ఆరాధించెదను||