yesayyaa ninnu choodaalani aashaయేసయ్యా నిన్ను చూడాలని ఆశ
యేసయ్యా నిన్ను చూడాలని ఆశ మెస్సయ్యా నిన్ను చేరాలని ఆశ (2) ఎవరు ఉన్నారు నాకు ఈ లోకంలో ఎవరు ఉంటారు తోడు నా జీవితమందు ఇమ్మానుయేలైన నా దైవం నీవేగా (2) ||యేసయ్యా|| అందరు ఉన్నారని అందరు నావారని (2) తలచితిని భ్రమచితిని చివరికి ఒంటరి నేనైతిని (2) చివరికి ఒంటరి నేనైతిని నా గానం నీవయ్యా నా ధ్యానం నీవయ్యా నా ప్రాణం నీవయ్యా నా సర్వం నీవయ్యా ||యేసయ్యా|| అంధకారములో అంధుడ నేనైతిని (2) నిను చూచే నేత్రములు నాకొసగుమా నజరేయుడా (2) నాకొసగుమా నజరేయుడా నా ఆశ నీవయ్యా నా ధ్యాస నీవయ్యా నా భాష నీవయ్యా నా శ్వాస నీవయ్యా ||యేసయ్యా||