yesayyaa praana naatha entho manchodivayyaaయేసయ్యా ప్రాణ నాథా ఎంతో మంచోడివయ్యా
యేసయ్యా ప్రాణ నాథా – ఎంతో మంచోడివయ్యా సిలువలో ప్రాణం పెట్టినావయ్యా రక్తమిచ్చి కొన్నావయ్యా యేసయ్యా నన్ను.. రక్తమిచ్చి కొన్నావయ్యా యేసయ్యా మరణాంధకారములో పడియున్న వేళ ఉదయించినావు ఓ నీతి సూర్యుడా (2) కురిసింది కల్వరి ప్రేమ నీ రుధిర ధారలై (2) నిను వీడి క్షణమైనా నే బ్రతుకలేను (2) ||యేసయ్యా|| మరణ పాశాలన్ని ఛేదించినావు ప్రేమ పాశాలతో దీవించినావు (2) నీ ప్రేమ బానిసగా నను చేసుకున్నావు (2) మోడైన నా బ్రతుకు చిగురింపజేశావు (2) ||యేసయ్యా|| మృతిని గెల్చి లేచావు మహిమను దాల్చావు ఈ మట్టి దేహాన్ని మహిమతో నింపావు (2) నా సృష్టికర్తవు నా క్రీస్తు నీవు (2) రానున్న రారాజు నీ వధువు నేను (2) ||యేసయ్యా||
yesayyaa praana naatha – entho manchodivayyaa
siluvalo praanam pettinaavayyaa
rakthamichchi konnaavayyaa yesayyaa
nannu.. rakthamichchi konnaavayyaa yesayyaa
maranaandhakaaramulo padiyunna vela
udayinchinaavu o neethi sooryudaa (2)
kurisindi kalvari prema nee rudhira dhaaralai (2)
ninu veedi kshanamaina ne brathukalenu (2) ||yesayyaa||
marana paashaalanni chedinchinaavu
prema paashaalatho deevinchinaavu (2)
nee prema baanisagaa nanu chesukunnaavu (2)
modaina naa brathuku chigurimpajesaavu (2) ||yesayyaa||
mruthini gelchi lechaavu mahimanu daalchaavu
ee matti dehaanni mahimatho nimpaavu (2)
naa srushtikarthavu naa kreesthu neevu (2)
raanunna raaraaju nee vadhuvu nenu (2) ||yesayyaa||