vijayaseeludaa naa praana priyudaaవిజయశీలుడా నా ప్రాణ ప్రియుడా
విజయశీలుడా నా ప్రాణ ప్రియుడా కృతజ్ఞతతో నిను స్తుతించెదను (2) నా యేసయ్యా నిను వేడుకొనగా నా కార్యములన్నియు సఫలము చేసితివి (2) ||విజయశీలుడా|| అలసిన సమయమున – నా ప్రాణములో త్రాణ పుట్టించినావు – (2) ఆదరణ కలిగించి పిలుపును స్థిరపరచి ధైర్యముతో నింపినావు (2) నిత్యానందము కలిగించె నీ శుభ వచనములతో – నెమ్మదినిచ్చితివి (2) ||విజయశీలుడా|| ఆశ్చర్యకరముగ – నీ బాహువు చాపి విడుదల కలిగించినావు – (2) అరణ్య మార్గమున విడువక తోడై విజయముతో నడిపినావు (2) నీ స్వాస్థ్యమునకు తండ్రిగ నిలిచి వాగ్ధాన భూమిలో – చేర్చిన దేవా (2) ||విజయశీలుడా|| ఆరోగ్యకరమైన నీ – రెక్కల నీడలో ఆశ్రయమిచ్చితివి నాకు – (2) అక్షయుడా నా సంపూర్ణతకై మహిమాత్మతో నింపినావు (2) నిత్యము నీతో నేనుండుటకై నూతన యెరూషలేము నిర్మించుచున్నావు (2) ||విజయశీలుడా||
vijayaseeludaa naa praana priyudaa
kruthagnathatho ninu sthuthinchedanu (2)
naa yesayyaa ninu vedukonagaa
naa kaaryamulanniyu saphalamu chesithivi (2) ||vijayaseeludaa||
alasina samayamuna – naa praanamulo thraana puttinchinaavu – (2)
aadarana kaliginchi pilupunu sthiraparachi dhairyamutho nimpinaavu (2)
nithyaanandamu kaliginche nee
shubha vachanamulatho – nemmadinichchithivi (2) ||vijayaseeludaa||
aascharyakaramuga – nee baahuvu chaapi vidudala kaliginchinaavu – (2)
aranya maargamuna viduvaka thodai vijayamutho nadipinaavu (2)
nee swaasthyamunaku thandriga nilachi
vaagdhaana bhoomilo – cherchina devaa(2) ||vijayaseeludaa||
aarogyakaramaina nee – rekkala needalo aashrayamichchithivi naaku – (2)
akshayudaa naa sampoornathakai mahimaathmatho nimpinaavu (2)
nithyamu neetho nenundutakai
noothana yerushalem nirminchuchunnaavu (2) ||vijayaseeludaa||