viduvanu ninu edabaayanani naaవిడువను నిను ఎడబాయనని నా
విడువను నిను ఎడబాయనని నా కభయ మొసంగిన దేవా నా కభయ మొసంగిన దేవా నేరములెన్నో చేసి చేసి – దారి తప్పి తిరిగితినయ్యా (2) నేరము బాపుము దేవా – నీ దారిని నడుపుము దేవా ||విడువను|| పందులు మేపుచు ఆకలి బాధలో – పొట్టును కోరిన నీచుడనయ్యా (2) నీ దరి చేరితినయ్యా నా తండ్రివి నీవెగదయ్యా ||విడువను|| మహిమ వస్త్రము సమాధానపు జోడును నాకు తొడిగితివయ్యా (2) గొప్పగు విందులో చేర్చి నీ కొమరునిగా చేసితివి ||విడువను|| సుందరమైన విందులలో పరిశుద్దులతో కలిపితివయ్యా (2) నిండుగా నా హృదయముతో దేవ వందనమర్పించెదను ||విడువను||