viduvavu nannika ennadainanuవిడువవు నన్నిక ఎన్నడైననూ
విడువవు నన్నిక ఎన్నడైననూ పడిపోకుండా కాయు రక్షకా (2) పడిపోవు వారెల్లరిని లేపెడి వాడవు నీవే ప్రభు (2) ||విడువవు|| ప్రభువా నీకవిధేయుడనై పలు మారులు పడు సమయములలో (2) ప్రేమతో జాలి దీన స్వరముతో ప్రియుడా నను పైకెత్తితివి (2) ||విడువవు|| ఆదాము హవ్వలు ఏదెనులో ఆశతో ఆజ్ఞ మీరినను (2) సిలువకు చాయగా బలినర్పించి ప్రియముగా విమోచించితివి (2) ||విడువవు|| మా శక్తియు మా భక్తియు కాదు ఇలలో జీవించుట ప్రభువా (2) కొల్లగా నీ ఆత్మను నొసగితివి హల్లెలూయా పాడెదను (2) ||విడువవు||