vidheyathake ardhamu cheppina vinaya manaskudaaవిధేయతకే అర్ధము చెప్పిన వినయ మనస్కుడా
విధేయతకే అర్ధము చెప్పిన వినయ మనస్కుడా విధేయులుగా ఉండ మాదిరి చూపిన మనుజ కొమరుడా అవిధేయత తొలగించుమయ్యా నీ దీన మనస్సు కలిగించుమయ్యా (2) ||విధేయతకే|| పరిచర్య చేయుటకే ధరణికి వచ్చిన త్యాగమూర్తివి ప్రతి చర్య జరిగించక పగవారిని క్షమియించిన ప్రేమ దీప్తివి (2) సిలువ మరణము పొందునంతగా నీవే తగ్గించుకొంటివి (2) అధికముగా హెచ్చింపబడితివి (2) ||అవిధేయత|| పరిపూర్ణమైన భయ భక్తులతో తండ్రికి లోబడితివి ప్రతి విషయములో పంపిన వాని చిత్తము నెరవేర్చితివి (2) శ్రమలు పొంది యాజకుడని దేవునిచే పిలువబడితివి (2) రక్షణకు కారకుడవైతివి (2) ||అవిధేయత||
vidheyathake ardhamu cheppina vinaya manaskudaa
vidheyulugaa unda maadiri choopina manuja komarudaa
avidheyatha tholaginchumayyaa
nee deena manassu kaliginchumayyaa (2) ||vidheyathake||
paricharya cheyutake dharaniki vachchina thyaagamoorthivi
prathi charya jariginchaka pagavaarini kshamiyinchina prema deepthivi (2)
siluva maranamu pondunanthagaa neeve thagginchukontivi (2)
adhikamugaa hechchimpabadithivi (2) ||avidheyatha||
paripoornamaina bhaya bhakthulatho thandriki lobadithivi
prathi vishayamulo pampina vaani chitthamu neraverchithivi (2)
shramalu pondi yaajakudani devuniche piluvabadithivi (2)
rakshanaku kaarakudavaithivi (2) ||avidheyatha||