sajeevudavaina yesayyaaసజీవుడవైన యేసయ్యా
సజీవుడవైన యేసయ్యా నిన్నాశ్రయించిన నీ వారికి సహాయుడవై తృప్తి పరచితివే సముద్రమంత సమృద్ధితో (2) ఆనందించెద నీలో – అనుదినము కృప పొంది ఆరాధించెద నిన్నే – ఆనంద ధ్వనులతో (2) ధన రాసులే ఇలా – ధనవంతులకు – ఈ లోక భాగ్యము దాచిన మేలులెన్నో – దయచేసినావే – ఇహ పరమున నాకు (2) శ్రమల మార్గమును నిరీక్షణ ద్వారముగా చేసితివి శ్రేష్టమైన నీ వాగ్ధానములతో (2) ||సజీవుడవైన|| క్షేమము నొందుటయే – సర్వ జనులకు – ప్రయాసగా మారే క్షేమాధారము నీవై – దీర్ఘాయువుతో – సంతృప్తి పరతువు నన్ను (2) నిత్య నిబంధనగా నీ వాత్సల్యమును చూపితివే నిత్యమైన నీ సత్య వాక్యముతో (2) ||సజీవుడవైన|| నలువది ఏండ్లు – నీ స్వాస్థ్యమును – మోసినది నీవే నీ కృప కాంతిలో – నా చేయి విడువక – నడిపించుచున్నది నీవే (2) పరమ రాజ్యములో మహిమతో నింపుటకు అనుగ్రహించితివే పరిపూర్ణమైన నీ ఉపదేశమును (2) ||సజీవుడవైన||
sajeevudavaina yesayyaa
ninnaashrayinchina nee vaariki
sahaayudavai thrupthi parachithive
samudramantha samruddhitho (2)
aanandincheda neelo – anudinamu krupa pondi
aaraadhincheda ninne – aananda dhvanulatho (2)
dhana raasule ila – dhanavanthulaku – ee loka bhaagyamu
daachina melulenno – dayachesinaave – iha paramuna naaku (2)
shramala maargamunu nireekshana dwaaramuga chesithive
shreshtamaina nee vaagdhaanamulatho (2) ||sajeevudavaina||
kshemamu nondutaye – sarva janulaku – prayaasagaa maare
kshemaadhaaramu neevai – deerghaayuvutho – santhrupthi parathuvu nannu (2)
nithya nibandhanagaa nee vaathsalyamunu choopithive
nithyamaina nee sathya vaakyamutho (2) ||sajeevudavaina||
naluvadi endlu – nee swaasthyamunu – mosinadi neeve
nee krupa kaanthilo – naa cheyi viduvaka – nadipinchuchunnadi neeve (2)
parama raajyamulo mahimatho nimputaku anugrahinchithive
paripoornamaina nee upadeshamunu (2) ||sajeevudavaina||