maa oohalu puttaka munupe మా ఊహలు పుట్టక మునుపే మా సర్వమునెరిగిన దేవ
పల్లవి: మా ఊహలు పుట్టక మునుపే - మా సర్వమునెరిగిన దేవ (2x) ఇహపరములలో నీవే - మా కోర్కెలు తీర్చెడి ప్రభువా (2x) ఆ.ప. విశ్వాస నిరీక్షణతో - కనిపెట్టియున్నచో (2x) పొందెదమెన్నో మేలులూ - ప్రభువా నీ పాద సన్నిధిలో (2x) 1. నిన్నడుగకుండగనే - మోషేను పిలచితివి నిన్నడిగిన సొలోమోనుకు - జ్ఞాన సిరుల నొసగిన దేవా పలు సమయాల యందు - పలు వరముల నిచ్చితివే అడుగనేల ప్రభువా - ఈ ధరలో - నీ దివ్య కృపయే చాలు ...మా ఊహలు... 2. ప్రార్ధించుచుంటిమి - సమస్యలు తీర్చుమని నిన్నడిగుచున్నాము - నీ రాజ్యములొ చోటిమ్మని ఊహించు వాటికంటె - అధికముగా నిచ్చెడి దేవ ఇంతకంటె మాకేమి వలదు - నీ తోడు నీడె చాలు ...మా ఊహలు...